లక్ష్మీకాన్తమ్మ గారికి జరిగిన గౌరవాలు అనేకం. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఈ క్రిందివి.
గౌరవాలు
డా || చిల్లర భవాని గారిచే లక్ష్మీకాన్తమ్మ గారి మోనోగ్రాఫ్
డా || ముక్తేవి భారతిదేవి గారిచే లక్ష్మీకాన్తమ్మ గారి మోనోగ్రాఫ్
2008 లో కొక విమల కుమారి గారిచే స్థాపించబడిన ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ గారి కళాపీఠం తరపున పలువురు విదుషీమణులకు ప్రతి సంవత్సరం సమ్మానం
2016 లో బొమ్మిడాల కృష్ణ గారి చేత చేయించబడిన లక్ష్మీకాన్తమ్మ గారి కాంస్యవిగ్రహం శ్రీకొణిజేటి రోశయ్య గారిచే ఆవిష్కరణ
2017 లో కోకా విమల కుమారి గారి చే లక్ష్మీకాన్తమ్మ శత జయంతి సభ
ఇతర గౌరవాలు
కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్ర సాహిత్య అకాడమీ మొదలగు వివిధ సంస్థలలో సలహా సంఘ సభ్యత్వం.
"ఆంధ్ర సారస్వత పరిషత్తు" హైద్రాబాదు వారిచే నిర్వహించబడిన "తెలుగువెలుగులు" కార్యక్రమంలో లక్ష్మీకాన్తమ్మ చరిత్ర.
కావ్యాంకితాలు
శ్రీమతి శ్రీఆనందారామం, శ్రీ సత్యవోలు నరసింహరావు గార్ల రచనలు
గంగాదేవి విరచిత మధురా విజయకావ్యానికి పోతుకూచి సుబ్రహ్మణ్యం గారి తెలుగు సేత
విదేశీపర్యటన
1972 లో కేంద్ర సాహిత్య పరిషత్తు వారిచే ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ సాంస్కృతిక పర్యటనలో ఏకైక మహిళా ప్రతినిధిగా ఎంపిక.